టెక్సస్ లో కాల్పుల కలకలం.. ఒకే ఇంట్లో
అమెరికాలో ఓ వ్యక్తి ఓ ఇంట్లో మారణకాండ సృష్టించాడు. తుపాకీతో కాల్పులు జరిపి ఐదుగురిని చంపాడు. అతని భార్య, ఆమె ఇద్దరు పిల్లలతో పాటు మరో ఇద్దరి ఉసురు తీశాడు. అనంతరం ఈ విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా కాల్పులకు తెగబడ్డాడు. కానీ ఎదురు కాల్పుల్లో గాయపడి పోలీసుల చేతికి చిక్కాడు. టెక్సస్ రాష్ట్రంలోని మెక్‌గ్రెగర్ పట్టణంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకం రేపింది. కాగా, నిందితుడు కాల్పులు జరిపిన సమయంలో ఆ ఇంట్లో మరికొందరు చిన్నారులు కూడా ఉన్నారని వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కాల్పులకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.













