అమెరికా పంపించిన అత్యవసర సాయం…

భారత్‍లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితుల్ని అడ్డుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు భారత్‍కు సాయమందించడానికి ముందుకొచ్చాయి. అందులో భాగంగా అమెరికా కూడా అత్యవసర సాయాన్ని అందించనుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గత వారం ట్విటర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. అమెరికా పంపించిన అత్యవసర సాయంగా చికిత్సలో భాగంగా 400 ఆక్సిజన్ సిలిండర్లు, పది లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను భారత్‍కు పంపింది. వీటిని అమెరికా సూపర్ గెలాక్సీ విమానంలో పంపగా అది ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. కోవిడ్‍తో పోరాడేందుకు అవసరమైన అత్యవసర పరికరాలు భారత్‍కు చేరాయి అని ఈ విషయాన్ని భారత్‍లోని అమెరికా దౌత్య కార్యాలయం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు యూఎస్ ఎంబసీ భారతదేశానికి తాము సహాయం చేస్తామని ఇచ్చిన మాట మేరకు సహాయం అందిస్తున్నామని, సహాయానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.