వైద్య చరిత్రలో అద్భుతం…
వైద్య చరిత్రలో అద్భుతం చోటుచేసుకొన్నది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకున్నప్పటికీ, పూర్తిస్థాయిలో నయంకాని క్యాన్సర్ మహమ్మారి ఓ ఔషధంతో సమూలంగా మాయమైపోయింది. యావత్తు ప్రపంచ దేశాలూ ఆనందాశ్చర్యాలకు కారణమైన ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకున్నది. మలాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న 18 మంది రోగులకు వైద్యులు డోస్టర్లిమాబ్ అనే ఔషధాన్ని ఇచ్చారు. కోర్సు పూర్తయిన తర్వాత రోగులకు ఎండోస్కోపీ, పీఈటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్‌ను తీయించారు. పురీషనాళంలో ఉన్న క్యాన్సర్ గడ్డ ఆశ్చర్యకరంగా మాయమైంది. ఇతర అవయవాల్లో కూడా క్యాన్సర్ కణాలు కనిపించ లేదు. ఫలితాలను ఇతర వైద్యులు కూడా పరీక్షించి ధ్రువీకరించారు. పెద్దమొత్తంలో ట్రయల్స్ నిర్వహణకు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.













