అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం… ప్రభుత్వ కార్యాలయాలను, విద్యా సంస్థలను
అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తోంది. హిమపాతం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వ కార్యాలయాలను, విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రోజంతా మంచు కురుస్తుండటంతో పలు ప్రాంతాలలో 30 సెంటీమీటర్లకు పైగా మంచు పేరుకుపోయింది. మాన్హాట్టన్కు సమీపంలోని లాంగ్ ఐలాండ్లో 25 సెంటీమలర్ల మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలోనూ మంచు దట్టంగా గుట్టలుగా పేరుకుపోయింది. ఎటుచూసినా హిమపాతమే కనిపిస్తోంది. రోడ్లన్నిటికీ మంచు కప్పేసింది. మంచు తుఫాన్ భారీగా కురుస్తుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. మంచు తుఫాన్ కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. పలు విమాన సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటన చేశాయి. దీంతో సుమారు 4 వేలకు పైగా విమనాలు రద్దయ్యాయి.













