చైనాలో మరో కొత్త వైరస్…
చైనా దేశంలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత మరో ఇన్ఫెక్షన్ వెలుగు చూసింది. చైనా దేశంలోని గన్సు ప్రావిన్సు లాన్ జౌలో 6 వేల మందికి బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. లాన్ జౌలో 55,725 మందిని పరీక్షించగా, వారిలో 6,620 మందికి బ్రూసెల్లోసిస్కు పాజిటివ్ అని తేలిందని చైనా ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. గన్స్ ప్రావిన్సులోని లాన్ జౌ నగరంలో పశువుల ద్వారా వ్యాపించిన బ్రూసెల్లోసిస్ వ్యాధి బారిన 6,620 మంది పడ్డారని అధికారులు ధ్రువీకరించారు. జంతువులతో ప్రత్యక్ష సంబంధం వల్ల, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం వల్ల మనుషులకు ఫ్లూ లాంటి లక్షణాలతో కూడిన బ్రూసెలోసిస్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చైనాలోని పశుసంవర్ధకశాఖ యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో ఈ వైరస్ వ్యాప్తి చెందిందని లాన్ జౌ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది.













