ఈ చర్యను అమెరికా సహించదు…. దీనిపై పోరు

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‍బుక్ రెండేళ్ల పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ను నిషేధించిన విషయం విషయం తెలిసిందే. దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇది అమెరికన్లను అవమానించడమే అని ఆయన విమర్శించారు. ప్రజలు ఓటు వేసి తనను గెలిపించారని, ఎఫ్‍బీ తీసుకున్న నిర్ణయం అమెరికన్లకు అవమానకరమని ట్రంప్ అన్నారు. ఎన్నికల్లో నాకు ఓటేసిన 7.5 కోట్ల మంది ఓటర్లను, మద్దతు తెలిపిన వారిని అవమానించి రికార్డు సృష్టించింది. ఈ చర్యను అమెరికా ఎంత మాత్రం సహించదు. దీనిపై పోరు కొనసాగించి.. విజయం సాధించి తీరుతాం అని పేర్నొన్నారు.
ఈ నిషేధం వల్ల నవంబర్ 2022లో జరిగే మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ 2024లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల సమయానికి మళ్లీ ట్రంప్ ఎఫ్‍బీలో దర్శనమిచ్చే అవకాశాలు ఉన్నాయి. క్యాపిటల్ హిల్ దాడి ఘటన తర్వాత ట్విట్టర్, యూట్యూబ్‍లు ట్రంప్ అకౌంట్లను పర్మినెంట్‍గా బ్యాన్ చేశారు. ఈ నిషేధ ఆజ్ఞలు 2023 జనవరి వరకు వర్తిస్తాయి.