ఫేస్బుక్ పేరు మార్పు!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పేరు మారే అవకాశాలున్నాయి. ఫేస్బుక్ రీబ్రాండ్పై సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రణాళికలను సిద్ధం చేశాయి. ఈ అంశంపై అక్టోబర్ 28న కంపెనీ కనెక్ట్ కాన్ఫరెన్స్లో చర్చించనున్నారని తెలిసింది. ఫేస్బుక్ రిబ్రాండ్కు సంబంధించిన సమాచారం త్వరలోనే వెల్లడి కానుందని వివరించింది. కాగా బ్రాండిరగ్లో ఒరిజినల్ ఫేస్బుక్ యాప్, సర్వీసులు యథాతతంగా కొనసాగించే అంచనాలున్నాయి. ఇన్స్టాగ్రామ్, వాట్సప్ మాదిరిగానే పేరెంట్ కంపెనీ కింద కొత్త బ్రాండ్ కొనసాగనుందని రిపోర్ట్ పేర్కొంది. పేరెంట్కి కంపెనీకి అనేక ఉత్పత్తుల్లో ఫేస్బుక్ కూడా ఒకటిగా ఉండనుంది.













