ఫేస్బుక్ లో కొత్త ఫీచర్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తన యూజర్లకు కొత్తగా అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ యాప్‌లో ఉండే వాయిస్, వీడియో కాల్స్ కు ఉండే ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రస్తుతం ఫేస్బుక్ మెసెంజర్ యాప్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత చేరనుంది. కాగా గతంలోనే వాట్సాప్, ఫేస్బుక్ మెసేంజర్లలోని యూజర్లకు పంపే మెసేజ్‌లకు ఎండ్-టూ ఎండ్ ఎన్క్రిప్షన్కు ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా దిగ్గజం మేసేజింగ్ సేవల పోర్ట్‌ఫోలియోలో క్రమంగా ఆడియో, వీడియో ఫీచర్లను జోడించింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్‌లో భాగంగా సందేశాలు, కాల్ల కంటెంట్ మీ ఫోన్ నుంచి రిసీవర్‌కు చేరుకునే వరకు భద్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఫేస్బుక్ తన ప్రసిద్ధ ఇమేజ్- షేరింగ్ యాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరితో ఒకరు సంభాషణల కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.













