ఫేస్బుక్ యూజర్ లుకు శుభవార్త… త్వరలోనే
ఫేస్బుక్ యూజర్లకు ఫేస్బుక్ శుభవార్తను అందించింది. క్లబ్‌హౌజ్, ట్విటర్ స్పేస్ తరహాలో ఫేస్బుక్ లైవ్ ఆడియో రూమ్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ లైవ్ ఆడియో రూమ్స్ ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లైవ్ ఆడియో రూమ్స్ సెలబ్రిటీలకు, కొన్ని గ్రూప్‌లకు అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు సపరేట్గా లైవ్ ఆడియో రూమ్స్ క్రియోట్ ఫీచర్‌ను త్వరలోనే తెచ్చేందుకు ఫేస్బుక్ ప్రయత్నాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఫేస్బుక్ క్లబ్ హౌజ్, ట్విటర్ స్పేస్ తరహా లాంటి ఆడియో రూమ్స్‌ను క్రియేట్ చేసేందుకు సమయాత్తమైంది. అందులో భాగంగా యూజర్లకు లైవ్ ఆడియో రూమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. లైవ్ ఆడియో రూమ్స్‌లో స్పీకర్‌గా చేరడానికి ప్రజలను ఆహ్వానించే శక్తి హోస్ట్‌కి ఉంది. కాగా స్పీకర్ చేసే సంభాషణను ఎవరైనా వినవచ్చు.













