తాలిబన్ లకు షాక్ ఇచ్చిన.. ఫేస్బుక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తాలిబన్లలకు షాక్ ఇచ్చింది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ యాప్‌లను వినియోగించకుండా తాలిబన్లపై ఫేస్బుక్ నిషేధం విధించింది. తాలిబన్లకు మద్దతుగా ఉన్న కంటెంట్‌పై కూడా నిషేధం విధించనుంది. తాలిబన్ లకు అనుకూలంగా ఉన్న కంటెంట్, వీడియోలను పోస్ట్ లను తొలగించేందుకు ప్రత్యేమైన అఫ్గాన్ నిపుణుల బృందాన్ని ఫేస్బుక్ ఏర్పాటు చేసింది. యూఎస్ తాలిబన్ లను టెర్రరిస్టు సంస్థ గుర్తించిన్నట్లు ఫేస్బుక్ పేర్కొంది. తాలిబన్ లు కమ్యూనికేట్ చేసుకోవడం కోసం వాట్సాప్ యాప్ వాడుతున్నట్లు తమ వద్ద నివేదికలు ఉన్నాయని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్‌లో సర్య్యూలేట్ అయ్యే మెసేజ్‌లకు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ పేర్కొంది. గత కొన్నేళ్లుగా తాలిబన్ తన సందేశాలను వ్యాప్తి చేయడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను వాడుకుంటుంది. తాలిబన్ ల సందేశాలను నిర్మూలించడం కోసం ఫేస్బుక్ ప్రత్యేకంగా స్థానిక దరి పెర్షియన్, పాప్టో భాషలను మాట్లాడే అఫ్గాన్ నిపుణులను నియమించినట్లు ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు.













