భారతీయ విద్యార్థులకు ఎరాస్మస్ మండస్ ఉపకార వేతనం
ఐరోపాలోని ప్రతిష్ఠాత్మక ఎరాస్మస్ మండస్ ఉపకారవేతనానికి ఈసారి భారత్ నుంచి రికార్డు స్థాయిలో 174 మంది ఎంపికయ్యారు. వీరిలో 50 శాతం మంది అమ్మాయిలే. గతేడాది ఈ ఉపకారవేతనాన్ని 161 మంది భారత విద్యార్థులు దక్కించుకున్నారు. ఐరోపా సమాఖ్య (ఈయూ) నిధులతో ఈ ఉపకార వేతనం అందిస్తారు. 2023`2025 బ్యాచ్కుగానూ ఎంపికైనవారు ఈయూ సభ్యు దేశాల్లోని రెండు విశ్వవిద్యాలయాల్లో డబుల్, మల్టిపుల్ డిగ్రీలతో పాటు పరిశోధన చేయొచ్చు. ఈ సారి ప్రపంచ వ్యాప్తంగా 143 దేశాల నుంచి 2,835 మంది విద్యార్థులు ఈ ఉపకారవేతనానికి ఎంపికవగా, భారత్లో ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఢల్లీి, కేరళ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఎంపికయ్యారు.













