ఆమెతో నాకు సంబంధం లేదు.. మస్క్ వివరణ
గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గే భార్య నికోల్ షెనహాన్తో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్‌కు ఎఫైర్ ఉందంటూ వార్తలు హల్చల్ చేశాయి. అందుకే బ్రిన్కు మస్క్ మద్య మైత్రి చెడిందంటూ అంతర్జాతీయ వార్త సంస్థలు రాసుకొచ్చాయి. దీనిపై మస్క్ వివరణ ఇచ్చారు. ఇవన్నీ చెత్త కథనాలు, సెర్గీ, నేను మంచి మిత్రులం. గత మూడేండ్లలో నికోల్‌ను రెండుసార్లే కలిశాను. అప్పుడు కూడా మా చుట్టూ చాలా మంది ఉన్నారు. రొమాంటిక్‌గా ఏమీ లేదు అని ట్విట్టర్లో రాసుకొచ్చారు. గత ఏడాది డిసెంబర్ నుంచి వేరుగా ఉంటున్న బ్రిన్, నికోల్ ఈ ఏడాది జనవరిలో విడాకులకు దరఖాస్తుల చేసుకున్నారు. వీరు డిపోవడానికి మస్క్‌తో నికోల్తో సంబంధమే కారణమని ప్రచారం జరుగుతుంది.













