భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు : తరుణ్‌జీత్ సింగ్ సంధూ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధ్యావిధానం ద్వారా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అవుతాయని అని యూఎస్‌లోని భారత రాయబారి తరుణ్‌జీత్ సింగ్ సంధూ అన్నారు. ఈ ఏడాది అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థుల కోసం భారత కాన్సులేట్ జరల్ కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో తరుణ్‌జీత్ సింగ్ సంధూ మాట్లాడారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. భారత్, అమెరికా మైత్రిలో విద్యారంగం కీలకంగా మారిందని పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ భారతీయ విద్యార్థులు అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువుకోడానికి ఆసక్తి చూపించడం, అనేక ఇబ్బందులు ఎదుర్కొని అమెరికాకు రావడం అభినందించదగ్గ విషయమన్నారు. భారత్ శక్తిసామర్థ్యాలు ఏమిటో అమెరికాకు వచ్చిన విద్యార్థుల్లో కనిపిస్తాయన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన పరిశ్రమల ప్రతినిధులు కూడా విద్యార్థులు ఉద్ధేశించి మాట్లాడారు.













