సాయిసంపత్ అరుదైన ఘనత.. ఐక్యరాజ్యసమితిలో
స్విట్జర్లాండ్లోని జనీవాలో ఐక్యరాజ్యసమితి సమ్మిట్లో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ యువకుడు, ఈకో-పాన్ ఫౌండర్ సాయిసంపత్ ప్రజెంటేషన్ ఇచ్చి అరుదైన ఘనత సాదించారు. గత నెల 11న ప్రారంభమైన సమావేశాలు ఈ నెల 13 వరకు కొనసాగనున్నాయి. యువత, మానవ హక్కులు` వాతావరణ మార్పులు అనే అంశాలపై జరుగుతున్న చర్చల్లో 47 దేశాల దౌత్యవేత్తలు, పరిశీలకులు పాల్గొంటున్నారు. ఇందులో భారత్ నుంచి హాజరైన సాయిసంపత్ వ్యవసాయంలో ఆక్రమిత విదేశీ కలుపు వాతావరణ మార్పులు అనే అంశంపై మాట్లాడారు. పంటల్లో వచ్చే విదేశీ కలుపుమొక్కలు నిర్మూలనపై పలు సూచనలు చేశారు. పంటల్లో కలుపు తీత పనులను ఉపాధి హామీతో అనుసంధానం చేస్తే సత్ఫలితాలు వస్తాయని వెల్లడిరచారు.













