ఈ దాడి ఉక్రెయిన్ పనే.. రష్యా
ఉక్రెయిన్పై తరచూ డ్రోన్లతో దాడికి దిగే రష్యాకు డ్రోన్రూపంలో ఎదురుదాడి ఎదురైంది. ఉక్రెయిన్-రష్యా సరిహద్దు నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని కుర్స్క్ వైమానిక స్థావరంపై అనుమానాస్పద డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపించింది. స్థావరంలోని చమురు నిల్వ కేంద్రంపై దాడి జరగడంతో చెలరేగిన మంటలను అక్కడి అగ్నిమాపక సిబ్బంది ఆర్చేశారు. సరిహద్దుకు 300 మైళ్ల దూరంలోని రష్యా ప్రాంతాలపైనా దాడులు జరగడంతో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింతగా ముదరనుందనే వార్తలొచ్చాయి. కుర్స్క్ వైమానికి స్థావరంలో నిలిపిన యుద్ధవిమానాలు కొన్నింటికి అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్లే సామర్థ్యముంది. రష్యా, అత్యంత వ్యూహాత్మక వైమానిక స్థావరమైన కుర్స్క్ ఎయిర్ఫీల్డ్పై దాడి నేపథ్యంలో రష్యా గగనతల రక్షణ వ్యవస్థ సమర్థతపై నీలినీడలు కమ్ముకున్నాయి.













