రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో … డాక్టర్ రఘురాంకు
ప్రతిష్ఠాత్మక ది రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్ ఆఫ్ ఇంగ్లండ్ లో కిమ్స్ ఉషాలక్ష్మి రొమ్ము వ్యాధుల చికిత్స కేంద్రం సంచాలకుడు డాక్టర్ పి. రఘురాం(55)కు గౌరవ సభ్యత్వం లభించింది. లండన్లో జరిగిన కార్యక్రమంలో రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లండ్ అధ్యక్షుడు ఆచార్య నీల్ మోర్టెన్సేన్ చేతులమీదుగా డాక్టర్ రఘురాం ఈ గౌరవాన్ని స్వీకరించారు. శస్త్రచికిత్సల విభాగంలో ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా దీన్ని అందజేసినట్లు డాక్టర నీల్ మోర్టెన్ సెన్ తెలిపారు. భారత్ తరపున ఈ ఫెలోషిప్ పొందిన అత్యంత పిన్న వయస్కుడైన సర్జన్ డాక్టర్ రాఘురామే కావడం విశేషం.













