యూకేహెచ్‌సీడీఓ చైర్‌పర్సన్‌గా డా.ప్రతిమా చౌదరి
బ్రిటన్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్‌లలోని హీమోఫీలియా సెంటర్ వైద్యులకు సంబంధించిన ద యునైటెడ్ కింగ్డమ్ హీమోఫీలియా సెంటర్ డాక్టర్స్ ఆర్గనైజేషన్ (యూకేహెచ్‌సీడీఓ) చైర్‌పర్సన్‌గా ప్రొఫెసర్ డా.ప్రతిమాచౌదరి మావిళ్లపల్లి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవికి ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ప్రతిమ చౌదరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసించే మావిళ్లపల్లి వెంకట రమణయ్య చౌదరి, సరోజని. ఆమె ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎండీ కోర్సులు, బ్రిటన్‌లో ఎంఆర్సీపీ, ఫెలోషిప్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఫెథాలజిస్ట్స్ (ఎఫ్ఆర్సీ పాత్) పూర్తి చేసిన 1998 నుంచి లండన్‌లో వైద్యురాలిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో ప్రొఫెసర్‌గా, కేథరిన్ డార్మండీ హీమోఫీలియా అండ్ థ్రాంబోసిస్ సెంటర్ డైరెక్టర్‌గాను విధులు నిర్వహిస్తున్నారు.













