తెలుగు వైద్యుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం
బ్రిటన్‌లో తెలుగు వైద్యుడు ఘట్టమనేని హనుమంతరావుకు అరుదైన గౌరవం దక్కింది. కృష్ణా జిల్లాకు చెందిన ఆయన బ్రిటన్ ఎన్హెచ్ఎస్ పార్లమెంటరీ జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. యూకేలో సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా వైద్యరంగంలో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆ దేశ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుతో సత్కరించింది. మాంచెస్టర్‌లోని క్రిస్టీ కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో ఆయన 44 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ పురస్కారం కోసం 700కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చే ఏడాది జూన్ 7న ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు.













