కరోనా సంక్షోభానికి వ్యాక్సినేషన్ ఒక్కేటే పరిష్కారం : ఫౌచీ

భారతదేశంలో కరోనా సంక్షోభానికి వ్యాక్సినేషన్ ఒక్కటే దీర్ఘకాలిక పరిష్కారం అని అమెరికా వైద్య నిపుణుడు ఆంథోనీ ఫౌచీ సూచించారు. వ్యాక్సినేషన్ వేగంగా జరగాలంటే టీకా ఉత్పత్తిని దేశీయంగా, విదేశాల్లోనూ పెంచాలన్నారు. అందుకు తగ్గ అన్ని వనరులు భారత్ వద్ద ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, రోగులకు చికిత్స అందించడానికి ఏడాది క్రితం వూహాన్‍లో చైనా నిర్మించినట్టు భారీ స్థాయిలో తాత్కాలిక దవాఖానలను ఏర్పాటు చేయలన్నారు. వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి లాక్‍డౌన్ విధించాలని పునరుద్ఘాటించారు.