ప్రధాని మోదీకి అమెరికా అత్యున్నత పురస్కారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీని అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును అందించింది. ప్రధాని మోదీ తరపున ఈ అవార్డును శ్వేతసౌధంలో స్వీకరించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రయన్ చేతుల మీదుగా మోదీ తరపున అమెరికాలోని భారత రాయబారి తరుణ్జిత్ సింగ్ సంధు ఈ అవార్డును స్వీకరించారు. అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో మోదీ కృషి చేసినందుకు ప్రధాని మోదీకి అవార్డును అందజేసినట్లు ఓ బ్రియన్ ట్విట్టర్లో తెలిపారు. మీ నాయకత్వానికి ఇది గుర్తింపు అని ట్రంప్ అన్నట్టు రాబర్ట్ ట్వీట్ చేశారు.
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల నుంచి అవార్డులు అందుకున్నారు. 2016లో సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్, అదే సంవత్సరంలో ఘాజీ ఆమిర్ అమానుల్లాఖాన్ స్టేట్ ఆర్డర్ అవార్డును స్వీకరించారు. 2018లో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా, 2019లో యూఏఈ ఆర్డర్ ఆప్ ది జాయెర్ అవార్డు, అదే ఏడాది రష్యా ఆర్డర్ ఆఫ్ ఎండ్రు పురస్కారంతో పాటు ఆ సంవత్సరంలోనే మాల్దీవుల అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.













