దిమిత్రి మురటోవ్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్ శరణార్థుల కోసం
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ రష్యా జర్నలిస్టు దిమిత్రి మురటోప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 35 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులు వివిధ దేశాలకు శరణార్థులుగా వెళ్లిన నేపథ్యంలో వారి కోసం తన నోబెల్ గోల్డ్ మెడల్‌ను వేలం వేయనున్నట్లు ప్రకటించారు. తన నోబెల్‌ను వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని శరణార్థులకు సదుపాయాలు కల్పించడానికి వినియోగిస్తానని వెల్లడిరచారు. రష్యా ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో అధికార ప్రతికలు మాత్రమే ప్రస్తుతం పని చేస్తున్నాయని, వేలం ఈవెంట్‌ను తమ పత్రికలో ప్రచురించ లేకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.













