కేజీ మట్టి కోసం… రూ. ఆరున్నర లక్షల కోట్లు

అంగారక గ్రహం మీద కేజీ మట్టి కోసం రూ.ఆరున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధ (నాసా) అధికారికంగా ప్రకటించింది. అత్యంత విలువైనదిగా భావిస్తున్న అక్కడి మట్టిని భూమి మీదకు తెప్పించేందుకు యత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం నాసా 9 బిలియన్ల డాలర్లు (ఆరున్నర లక్షల కోట్లు) ఖర్చు చేయబోతోంది. అంగారక గ్రహం మీద దిగిన నాసా పర్సీవరెన్స్ రోవర్ ఇప్పటికే పరిశోధనలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ మట్టి భూమి మీదకు చేరేందుకు పదేళ్ల సమయం పట్టవచ్చని, అప్పుడు భూమిపైన అత్యంత విలువైన వస్తువుల్లో అదే అగ్రస్థానంలో ఉంటుందని నాసా వెల్లడించింది. ఈ ప్రాజెక్టు మూడు దశల్లో ఉంటుందని, రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. అయితే మార్స్ మట్టి కోసం నాసా ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.