నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్ టుటు ఇక లేరు
దక్షిణాఫ్రికా జాతివివక్ష వ్యతిరేక ఉద్యమ పోరాట యోధుడు, నల్లజాతి హక్కుల కోసం గళమెత్తిన వీరుడు, మానవహక్కుల ఉద్యమకారుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, క్రైస్తవ మతగురువు ఆర్చి బిషప్ డెస్మండ్ టుటు (90) కన్నుమూశారు. ఆయన గత కొన్నేళ్లుగా ప్రొస్టేట్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. తాజాగా చాలా సార్లు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన కేప్‌టౌన్‌లోని ఒయాసిస్ ఫ్రెయిల్ కేర్ సెంటర్లో తుది శ్వాస విడిచినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ప్రకటించారు. గొప్ప పోరాట యోధుడిని దేశం కోల్పోయింందని ఆవేదన వ్యక్తం చేశారు.
డెస్మండ్ టుటు మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా సహా ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు సంతాపం తెలిపారు. అహింసా మార్గంలో దక్షిణాఫ్రికా తెల్లపాలకులపై పోరాడిన.. టుటుకు 1984లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అప్పటికి ఆయన జొహన్నెస్‌బర్గ్ బిషప్‌గా ఉన్నారు. తర్వాత కేప్‌టౌన్ ఆర్చి బిషప్ అయ్యారు. బిషప్‌గా ఉంటూనే వర్ణవివక్షణకు మృతిరేకంగా దక్షిణాఫ్రికా ప్రజలను చైతన్య పరిచి నాటి తెల్లజాతి పాలకులపై రాజీలేని పోరాటం చేశారు.













