ఇది అమెరికా పాపమే : డెమొక్రాటిక్ సోషలిస్టుల విమర్శ
ఉక్రెయిన్పై రష్యా దండెత్తడానికి అమెరికా, నాటో కూటమిలే కారణమని, ఈ ఘర్ఘణలు తలెత్తడానికి అవే భూమికను సిద్ధం చేశాయని డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా (డిఎన్ఏ) విమర్శించింది. నాటో నుండి అమెరికా వైదొలగాలని, సామ్రాజ్యవాద విస్తరణవాదానికి స్వస్తి చెప్పాలన్న తన పిలుపును పునరుద్ఘాటించింది. నయా ఉదారవాద వ్యవస్థ వైఫల్యాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయని, సైనిక వాదం, సామ్రాజ్యవాదం, యుద్ధాల ద్వారా పాలక వర్గం కొత్త వ్యవస్థను నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని డిఎన్ఏ విమర్శించింది. ఇది యుద్ధం కాదు, వర్గ యుద్ధమని ప్రకటించింది. ఉక్రెయిన్పై రష్యా దూకుడును ఖండిస్తూ, తక్షణమే సంక్షోభ పరిష్కారానికి ఉద్రిక్తతల తగ్గింపు దౌత్య ప్రjత్నాలు చేపట్టాలని పిలుపుచ్చింది. ఈ యుద్ధ ఫలితాలు, ప్రభావాలు అనుభవించేది కార్మిక వర్గమేనని అందులో ఎటాంటి సందేహం లేదని డిఎన్ఏ స్పష్టం చేసింది.













