అమెరికాలో డ్రగ్స్ వివాదం.. కాల్పుల్లో
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర నగరమైన లాస్ ఏంజెలెస్‌లోని ఓ దుకాణ సముదాయం బయట మాదకద్రవ్యాల వ్వహారంలో కొందరు వ్యక్తుల నడుమ తలెత్తిన వివాదం పరస్పర కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వెస్ట్హిల్స్లో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిగిన చోటులో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మృతుణ్ని ఇంకా గుర్తించలేదని, క్షతగ్రాతులను ఆసుప్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడిరచారు. కాల్పుల అనంతరం నిందితులు పారిపోయేందుకు వాడిన వాహనాన్ని గుర్తించామని తెలిపారు.













