మాస్కోలో కీలక ఘటన…
ఉక్రెయిన్‌తో యుద్ధం జోరుగా సాగుతున్న వేళ మాస్కోలో కీలక ఘటన చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆంతరంగికుడు అలెగ్జాండర్ డూగిన్ కుమార్తె కారు బాంబు పేలుడులో మృతి చెందారు. పుతిన్ అధ్యాత్మిక గురువుగా డూగిన్కు పేరుంది. ఆయన సలహాతోనే ఉక్రెయిన్‌పై పుతిన్ సైనిక చర్య ప్రారంభించారని అంటారు. అలెగ్జాండర్‌ను లక్ష్యంగా చేసుకొనే ఈ కారు బాంబు దాడి జరిగిందని మస్కో వర్గాలు పేర్కొంటున్నాయి. డూగిన్ తన కుమార్తె డారియాతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి వీరిద్దరు ఒకే కారులో ఇంటికి వెళ్లాలి. చివరి నిమిషంలో డూగిన్ వేరే కారులోకి మారడంతో ఆయనకు ముప్పు తప్పింది. దొరికిన ఆధారాలను బట్టి ఇది ప్రమాణాళిక ప్రకారం చేసిన నేరంగానే కనిపిస్తోంది అని రష్యా విచారణాధికారులు తెలిపారు. పుతిన్ అంతరంగికుల్లో అలెగ్జాండర్ కీలక వ్యక్తి. అధ్యక్షుడి కళ్లు, చెవులు కూడా ఆయనేనని అంటారు.













