దక్షిణాఫ్రికా రచయితకు ప్రతిష్టాత్మక అవార్డు
దక్షిణాఫ్రికా రచయిత దామస్ గాల్గట్కు ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ అవార్డు లభించింది. ది ప్రామిస్ అనే నవలకు గాను ఆయనను ఈ పరస్కారానికి ఎంపిక చేశారు. 2003, 2010లోనూ ఆయన రచనలు షార్ట్‌లిస్ట్ అయినప్పటికీ అవార్డుకు ఎన్నిక కాలేదు. ఈ ఏడాది బుకర్ ప్రైజ్ కేసులో అమెరికన్ రచయితలు మరోసారి ఆధిపత్యం చెలాయించారు. ఈ అవార్డు కింద రూ.50 లక్షల నగదు బహుమతి అందుకోనున్నారు. శ్రీలంక రచయిత అనుక్ అరుద్ ప్రగాసంతో సహా మరో ఐదుగురు పోటీపడినప్పటికీ గాల్గట్కే ఈ పురస్కారం దక్కడం విశేషం. తనకు బుకర్ ప్రైజ్ రావడంతో డామన్ హర్షం వ్యక్తం చేశారు.













