బౌద్ధమతంలో అత్యున్నత నాయకుడిగా అమెరికాలో జన్మించిన బాలుడు
అమెరికాలో జన్మించిన మంగోలియన్ కుర్రాడిని బౌద్దమతంలో మూడవ అత్యున్నత నాయకుడిగా దలైలామా ప్రకటించారు. జెట్సున్ దంపారింపోచేను 10 వ ఖల్జాగా నిర్ణయించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో మార్చి 8న జరిగిన వేడుకలో ఎనిమిదేళ్ల బాలుడితో దలైలామా ముచ్చటిస్తున్న చిత్రాలు బయటకొచ్చాయ. యూఎస్ఏలో జన్మించిన ఎనిమిదేళ్ల ఈ బాలుడు కవల సోదరుడు. అతను యూనివర్సిటీ ప్రొఫెషర్ కుమారుడు. మాజీ మంగోలియన్ పార్లమెంటు సభ్యుని మనవడు. కాగా, టిబెటన్ బౌద్దమతం నిర్ణయం చైనాకు కోపం తెప్పించే అవకాశం ఉంది. ఇది తన సొంత ప్రభుత్వం ఎంపిక చేసిన బౌద్ద నాయకులను మాత్రమే గుర్తిస్తుంది. ఈ క్రమంలో దలైలామా తాజా నిర్ణయంపై ఓ వైపు ఉత్సాహం, మరోవైపు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.













