దుబాయ్ వేదికగా ప్రవాస భారతీయులతో భేటీ
దుబాయ్‌లో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న దుబాయ్ కల్చరల్ ఫెస్ట్, పలు స్థానిక కార్యక్రమాలు మరియు ప్రవాస భారతీయులతో రాజకీయ వ్యాపార రంగ అంశాలపై సమావేశమవ్వడానికి తమ ప్రతినిధి బృందం దుబాయికి బయలుదేరనున్నట్టు బిసి రాజ్యాధికార సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దాసు సురేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వారం పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి గల్ఫ్ దేశాలకు వలసపోయిన ప్రజలను, ముఖ్యంగా బీసీ సోదరులను ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలు, వారి ప్రధాన డిమాండ్లను తెలుసుకోనున్నామన్నారు. ప్రవాస భారతీయ నాయకులతో చర్చలతో పాటు అంతర్జాతీయంగా చేతి మృత్తులకు బీసీ కుల వృత్తిదారులు సృష్టించే ఉత్పత్తులకు ఉన్న మార్కెట్ అవకాశాలపై తమ బృందం అధ్యయనం చేయనున్నామన్నారు. దుబాయ్‌లోని భారత ఎంబసీ ప్రతినిధులను కూడా ఈ సందర్భంగా కలిసి అంతర్జాతీయ హబ్ గా ఉన్న దుబాయ్‌లో భారతీయ చేతి ఉత్పత్తులకు గల వ్యాపార, ఉద్యోగ అవకాశాలను ఇనుమడింపజేయనున్నామన్నారు.













