128 ఏళ్ల తర్వాత రీఎంట్రీ… లాస్ ఏంజిల్స్ లో!
క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇచ్చారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి క్రికెట్‌కు ఆమోదం తెలిపినట్లు ప్రకటన చేశారు. ముంబైలో జరిగిన ఐఓసీ ఎగ్జిక్యూటీ బోర్డు మీటింగ్‌లో పాల్గొన్న అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ విషయాన్ని తెలిపారు. ఒలింపిక్స్‌లో కొత్తగా అయిదు క్రీడలను చేర్చాలనుకున్నారని, దాంట్లో క్రికెట్ కూడా ఉందని, ఆ ప్రతిపాదనకు లాస్ ఏంజిల్స్ నిర్వాహకులు ఆమోదించినట్లు థామస్ బాచ్ పేర్కొన్నారు. బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ బాల్, స్క్యాస్, లాక్రోసీ క్రీడలను ఒలింపిక్స్‌లో ఆడించే ఛాన్సు ఉంది.













