ప్రపంచానికి అది ఓ గేమ్ ఛేంజర్ : అమెరికా

భారత్‍లో కొవిడ్-19 వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడం వల్ల ప్రపంచానికి అది ఓ గేమ్ ఛేంజర్ అవుతుందని బైడన్ పాలనా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొన్నది. భారత్‍లో ఇటీవల కొవిడ్ ఉధృత రూపం దాల్చడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‍ప్రైస్ అన్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఖ్యాడ్ (ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాల కూటమి) సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చించినట్టు ఆయన తెలిపారు. సంక్షోభ సమయంలో అమెరికా నుంచి భారత్‍కు 50 కోట్ల డాలర్ల విలువైన సహాయం అందించామని గుర్తు చేశారు.