2030 నాటికి మరో 20 కోట్ల 70 లక్షల మంది : ఐరాస
ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 దీర్ఘకాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పేదరికం మరింత పెరుగుతుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2030 నాటికి మరో 20 కోట్ల 70 లక్షల మంది తీవ్ర పేదరికంలోకి నెట్టబడతారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీఏ) తాజాగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. దీంతో 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కడు పేదల సంఖ్య 100 కోట్లు దాటుతుందని యూఎన్డీపీ తెలిపింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై కొవిడ్ 19 అనంతర ప్రభావం, వచ్చే దశాబ్ద కాలం పాటు ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాన్ని యూఎన్డీపీ అంచనా వేసింది. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థలో వచ్చిన సంక్షోభంలో 80 శాతం మరో పదేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపింది.













