గ్రాండ్ గా పెళ్లి వేడుక… ఏకంగా రూ.490 కోట్లు ఖర్చు
ఆడంబరంగా పెళ్లి చేయాలంటే హంగూ ఆర్భాటం, భారీస్థాయి విందు, ఆకట్టుకునే అలంకరణలు, ఇవన్నీ కనిపిస్తాయి. పారిస్ వేదికగా జరిగిన ఓ పెళ్లి మాత్రం వీటిని సరికొత్త ఎత్తుకు తీసుకువెళ్లింది. అమెరికాకు చెందిన కుటుంబం ఈ పెళ్లి కోసం 5.9 కోట్ల డాలర్లు (సుమారు రూ.490 కోట్లు) ఖర్చు చేసినట్లు తెలిసింది. అమెరికాకు చెందిన 26 ఏళ్ల మ్యాడిలైన్ బ్రోక్వే ఓ వ్యాపారవేత్త. ఆమె తండ్రి బాబ్ బ్రోక్వేకు ఫ్లోరిడాలో మెర్సిడెజ్ బెంజ్ కార్ల డీలర్షిప్ ఉంది. మ్యాడిలైడ్ ఇటీవల పారిస్ వేదికగా తన బాయ్ ఫ్రెండ్ జాకబ్ లాగ్రోన్ను వివాహం చేసకున్నారు. ఆ సందర్భంగా భారీ హంగులతో ఏర్పాటు చేసిన, వేదిక, భోజనాల గది, అమెరికా గాయకుల సంగీత కచేరీ అబ్బురపరిచింది. ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన దుస్తులు, ఆభరణాలతో వధూవరులు మెరిసిపోయారు.













