మళ్లీ సాధారణ పరిస్థితులు 2022లోనే..
కరోనా మహమ్మారి నుంచి మళ్లీ సాధారణ పరిస్థితులు 2022లోనే వస్తాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు.కరోనా వైరస్ విజృంభణ ఓ ఉహించలేని విషాదం అని, అయితే గుడ్న్యూస్ ఏంటంటే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడమే అని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపడుతున్న కోవాక్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు గేట్స ఫౌండేషన్ సహకరిస్తున్నదన్నారు. అత్యధిక నిధులు గేట్స్ సంస్థ నుంచి వెళ్తున్నాయని తెలిపారు. 2022 చివరినాటికి సాధారణ స్థితికి వస్తాయని ఆయన అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న సంస్థలకు గేట్స్ థ్యాంక్స్ తెలిపారు.













