బ్రెజిల్‍లో కోపా అమెరికా టోర్నీ..

దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక కోపా అమెరికా కప్ పుట్‍బాల్ టోర్నీ నిర్వహించేందుకు బ్రెజిల్ ముందుకొచ్చింది. ఈ నెల 13 నుంచి జూలై 10 వరకు బ్రెజిల్‍లో ఈ టోర్నీ జరగనుంది. షెడ్యూల్ ప్రకారమైతే ఈ టోర్నీకి రెండు దేశాలు (కొలంబియా, అర్జెంటీనా) అతిథ్యమివ్వాల్సింది. కానీ కొలంబియాలో రాజకీయ అస్థిరత ఏర్పడటం అర్జెంటీనాలో కరోనా కేసులు పెరగడంతో ఈ రెండు దేశాలు టోర్నీని నిర్వహించలేమని చేతులెత్తేశాయి.