ఆర్థశాస్త్రంలో క్లాడియా గోల్డిన్ కు నోబెల్ పురస్కారం
అర్థశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌కు లభించింది. లేబర్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికిగానూ గోల్డిన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. క్లాడియా గోల్డిన్ అమెరికాకు చెందిన ప్రముఖ లేబర్ ఎకనమిస్ట్. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మహిళా శ్రామిక శక్తి, సంపాదనలో లింగ వ్యత్యాసం, ఆదాయ అసమానత, సాంకేతిక మార్పు, విద్య, వలసలతో సహా అనేక రకాల అంశాలపై ఆమె పరిశోధన చేశారు. 1990ల్లోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక విభాగంలో పనిచేసిన ఏకైక మహిళ క్లాడియా గోల్డిన్. మహిళా ఆర్థిక శక్తిపై ఆమె ఎనలేని పరిశోధన చేశారు.













