నన్ను అపహరించి, హత్య చేయడమే వారి ఉద్దేశం
పాకిస్థాన్‌లో రాజకీయ ఘర్షణ వాతావరణం నెలకొంది. విదేశీ కానుకల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. పోలీసులు ఆయన అరెస్టుకు యత్నించడంతో లాహోర్‌లో తీవ్ర ఘర్షణ తలెత్తింది. పోలీసులు, పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. నన్ను అపహరించి, హత్య చేయడమే వారి అసలు ఉద్దేశం. అరెస్టు ప్లాన్ అనేది ఒక డ్రామా మాత్రమే. వారు బాష్పవాయులు, జలఫిరంగులు వాడారు. చివరకు లైవ్ ఫైరింగ్‌కు పాల్పడ్డారు. నేను ష్యూరిటీ బాండ్‌పై సంతకం చేసినా డీజీపీ దానిని అంగీకరించలేదు. వారి అరెస్టు ప్లాన్‌లో నిస్సందేహంగా ఏదో దురుద్దేశం ఉంది అని అన్నారు.













