దుబాయిలో జస్టిస్ ఎన్.వి. రమణకు ఘన స్వాగతం
దుబాయి వెళ్లిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులకు అక్కడి తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. భారత మధ్యవర్తిత్వ మండలి ఆధ్వర్యంలో ఈ నెల 19న దుబాయిలోని బబెరాయ్ బిజినెస్ బేలో ప్రపంచీకరణ యుగంలో మధ్యవర్తిత్వం అనే అంశంపై సదస్సు జరగనుంది. అబూధాబిలోని భారత సాంఘిక, సాంస్కృతిక కేంద్రంలో జరిగే అంతర్జాతీయ న్యాయ సదస్సులో జస్టిస్ రమణ పాల్గొంటారు. విమానాశ్రయంలో జస్టిస్ రమణకు డాక్టర్ ముక్క తులసి కుమార్, శ్రీకాంత్ చిత్తరువు, అనూరాధ, ఖాదర్ బాషా, చంద్రారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.













