ఆయన ఆలోచనలు రష్యాపై… ప్రభావం చూపాయి : అమెరికా
ప్రధాని మోదీపై అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ బిల్ బర్డ్స్ ప్రశంసలు కురిపించారు. రష్యా-ఉక్రియెన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో అణ్వాయుధ ప్రయోగం జరగకుండా చూశారని, తద్వారా పెను విధ్వంసాన్ని తప్పించారని మోదీని కొనియాడారు. అణ్వాయుధాలపై ప్రధాని మోదీ ఆలోచనలు రష్యన్లపై ప్రభావం చూపాయని తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని మోదీలు ఇరువురూ అణ్వాయుధ వినియోగంపై తమ ఆందోళనలను లేవనెత్తారు. ఇది రష్యన్లపై ప్రభావం చూపించింది. రష్యా కేవలం రెచ్చగొట్టేందుకు మాత్రమే అణ్వాయుధ అంశాన్ని లేవనెత్తిందని భావిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.













