పుట్టని బిడ్డకు అమెరికా మోడల్ నివాళి!
అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్, బుల్లితెర నటి క్రిస్సీ టైగెన్ పుట్టకముందే పోయిన తన మూడో బిడ్డకు జాక్కు నివాళులు అర్పించింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్లో ఇటీవల కొన్ని ఫొటోలను షేర్ చేసింది. తన ఫొటోలతో పాటు తన చేతికి మూడు బ్రాస్లెట్లు ధరించిన ఫొటో కూడా పెట్టింది. ఆమె చేతికి ఉన్న ఆ మూడు బ్రాస్లెట్లలో ఒకదానిపై తన కొడుకు మైల్స్ పేరు, మరోదానిపై తన బిడ్ల లూనా పేరు ఉన్నాయి. మరో బ్రాసెలెట్పై పుట్టకుండానే పోయిన మూడో బిడ్డ జాక్ పేరు ఉంది.
ఇన్స్టాలో పెట్టిన ఆ ఫొటోలకు క్రిస్సీ టైగెన్ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ రోజు నీవు జన్మించాల్సి ఉండె. నిన్ను మేం ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం అని ఆమె రాసుకుంది. క్రిస్సీ టైగెన్, సింగర్ జాన్ లెజెండ్ దంపతులకు మైల్స్, లూనా అనే ఒక కొడుకు, ఒక బిడ్డ ఉన్నారు. అయితే 2020, ఏప్రిల్లో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. కానీ దురదృష్టవశాత్తు 2020, సెప్టెంబర్లో ఆమెకు గర్భస్రావం జరిగింది. దాంతో క్రిస్సీ దంపతులు తీవ్ర ఆవేదన చెందారు. ఇరవై వారాల ఆ మగ పిండానికి జాక్ అని పేరు పెట్టుకున్నారు. గర్భస్రానం జరగకపోతే జాక్ ఆ ఫిబ్రవరిలో పుట్టాల్సి ఉండటంతో ఆమె డెలివరీకి వైద్యులు ఇచ్చిన తేదీన ఇన్స్టాగ్రామ్లో కొడుకు నివాళులు అర్పించింది. అతనిపట్ల తనకున్న ప్రేమను చాటుకుంది.













