పెండ్లి కాకున్నా సరే కానీ … పిల్లల్ని మాత్రం కనండి
జనాబా తగ్గిపోతున్న నేపథ్యంలో జననాల రేటు పెంచడానికి చైనా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. పెండ్లి కాకున్నా సరే పిల్లల్ని మాత్రం కనండి అంటూ ప్రకటనలు ఇస్తున్నది. మరో వైపు పెండ్లిళ్ల ఖర్చులు తగ్గించేలా చర్యలు చేపట్టింది. పెండ్లి కూతురిని పెంచేందుకు ఆమె కుటుంబానికి అయిన ఖర్చును వరుడు కైలీ రూపంలో చెల్లించే సంప్రదాయం చైనాలో ఉన్నది. చైనాలో జరిగే మూడొంతుల పెండ్లిండ్లలో ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇందుకోసం వరుడి కుటుంబం రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అనేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.













