పుతిన్ తో భేటీ అయిన చైనా రక్షణ మంత్రి
అమెరికా ఆంక్షల చట్టంలో ఉన్న చైనా రక్షణ మంత్రి లీ షెంగ్పూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆయన రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటన ఇదే. షెంగ్పూతో భేఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ ఇటీవల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పర్యటన చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని పేర్కొన్నారు. సైనిక రంగం సహా అన్ని విభాగాల్లో ఇరు దేశాలు సంబంధాలను బలపర్చుకొంటున్నాయని తెలిపారు. తిరుగులేని విశ్వాసంతో వ్యూహాత్మక సంబంధాలు మెరుగుపర్చుకొంటున్నట్లు పుతిన్ వెల్లడించారు.













