చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం!
చైనాను కరోనా వైరస్ వేరియంట్స్ టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. కొత్త వేరియంట్ బీఎఫ్-7 కారణంగా చైనాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తోంది. పాజిటవ్ కేసులు పెరుగుతున్న క్రమంలో చైనాలో ఆసుపత్రులు పూర్తిగా పేషెంట్స్‌తో నిండిపోయాయి. కరోనా వైరస్‌ను అడ్డుకుని పేషెంట్స్ రికవరీ కోసం చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు సిటీల్లో ప్రజలకు ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్ అందిస్తున్నారు. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోవడంతో స్పెషల్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయడంతో పాలుగా మందుల తయారీ సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కరసత్తు సాగిస్తోంది. ఇక వైరస్ వ్యాప్తితో బీజింగ్ వూహాన్, షైంజెన్, సాంఘై నగరాల్లో స్థానిక ప్రభుత్వాలు ప్రజలకు ఉచితంగా యాంటీ ఫీవర్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాయి.













