మూడోసారి ఆయనకే అధ్యక్ష పగ్గాలు!
చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నుంచి బీజింగ్‌లో జరుపుకొంటున్న నాలుగు రోజుల ప్లీనరీ సమావేశం పార్టీ నూరేళ్ల చరిత్రలో అరుదైన చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించి, షీ జిన్‌పింగ్ మూడోసారి దేశధ్యక్షుడిగా కొనసాగడానికి పచ్చజెండా ఉపనున్నది. ఈ సమావేశాల్లో 400 మంది కేంద్ర కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్టీ మహాసభలు సాధికారంగా జిన్‌పింగ్‌ను మళ్లీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తన నూరేళ్ల చరిత్రలో ఇంతవరకు రెండే రెండు చరిత్రాత్మక తీర్మానాలు చేసింది. ఈ సారి ఆమోదించేది మూడో తీర్మానమవుతుంది. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి, చరిత్ర గతిని మార్చడానికి చరిత్రాత్మక తీర్మానాలు చేస్తారు. వాటికి అత్యంత రాజకీయ ప్రాధానం ఉంది.
2022లో జరిగే పార్టీ మహాసభలు మూడోసారి జిన్‌పింగ్ నాయకత్వానికి సాధికారంగా ఆమోద ముద్ర వేసినా, ఆయన వారసుడెవరో తేల్చకుండా వదిలేస్తాయని నిపుణుల అంచనా. దీన్ని బట్టి జిన్‌పింగ్ జీవితకాల అధినాయకుడిగా కొనసాగడమే లేదా 2017లో నాలుగోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడమో జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.













