అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు ఎత్తివేత్త : చైనా
కరోనా కట్టడికి కఠిన నిబంధనలను విధించిన చైనా ఎట్టకేలకు సవరించింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఉన్న ఆంక్షలను సవరించింది. దీంతో దాదాపు రెండేండ్ల నుంచి భారత్, చైనా మధ్య నడవని డైరెక్ట్ విమానాలు ఇప్పుడు పాక్షికంగా ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులు చైనాకు వచ్చిన తర్వాత వారికి విధించే కార్వంటైన్ సమయాన్ని కూడా చైనా తగ్గించింది. ఇప్పటి వరకు 7 రోజుల క్వారంటైన్, 3 రోజులు అబ్జర్వేషన్ తప్పనిసరి కాగా, దీని 5 రోజుల క్వారంటైన్, 3 రోజుల అబ్జర్వేషన్గా మార్చింది. ముఖ్యంగా కఠిన నిబంధనలు విధించినప్పటికీ జాతీయంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటం, ఇదే సమయంలో విమానరంగానికి భారీ నష్టం వస్తుండటంతో చైనా ఈ సవరణలు చేసింది. అయితే స్థానికంగా మాత్రం కరోనా నిబంధలను కఠినంగానే అమలు చేస్తున్నది.













