పెలోసీ పై చైనా ఆంక్షలు
తాము ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పట్టించుకోకుండా తైవాన్లో ప్యటించిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు విధించింది. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు చైనాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది. తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమని, అలాంటప్పుడు తమ అనుమతి లేకుండా పెలోసీ ఎలా పర్యటిస్తారని ప్రశ్నించింది. తమ ఆదేశాలను ధిక్కరించడమంటే చైనా సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని వెల్లడించింది. అలాగే అమెరికాతో రక్షణ, వాతావరణ మార్పులు, ఇతర అంశాలపై చర్చలనూ రద్దు చేసుకుంటున్నామని తెలిపారు.













