చంద్రుడిపై నీటి జాడలు కనుక్కున్న చేంజ్-5
చంద్రుడిపై నీటి ఆనవాళ్ల కోసం కొన్ని దశాబ్దాలుగా అన్వేషణలు కొనసాగుతున్నాయి. తాజాగా చైనా ప్రయోగించిన చేంజ్-5 ల్యాండర్ ఈ దిశగా కీలక రుజువులను సేకరించింది. చంద్రుడిపై నీటికి సంబంధించి మొట్ట మొదటి ఆధారాన్ని అందించింది. చంద్రుడిపై పరిశోధన కేంద్రాలను నిర్మించడంతోపాటు, అంగారకుడిపైకి వలస వెళ్లేందుకు మానవాళి చేస్తున్న ప్రయత్నాలకు చంద్రుడిపై నీటి వనరుల తాజా ఆవిష్కరణ గొప్ప పురోగతి అని ఖగోళ శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌కు చెందిన లిన్ యాంగ్టింగ్, లిన్ హాంగ్లీ నేతృత్వంలోని సంయుక్త పరిశోధన బృందం చేంజ్-5 ల్యాండర్ ద్వారా సేకరించిన చంద్రుడి ఉపరితల నీటి అణువుల డేటాలను పరిశీలించింది. అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ నిర్వహిస్తున్న మల్టిడిసిప్లినరీ ఓపెన్ యాక్సెస్ సైంటిఫిక్ జర్నల్ అయిన సైన్ అడ్వాన్సెస్‌లో ఇందుకు సంబంధించిన నివేదిక ప్రచురితమైంది.













