చైనా జనాభా ఎంతో తెలుసా?

చైనా జనాభా 141.178 కోట్లుకు చేరుకుంది. 7వ జాతీయ జనగణన వివరాలను చైనా ప్రభుత్వం విడుదల చేసింది. రెండేండ్ల కిందటితో పోల్చితే 1.1 కోట్ల పెరిగింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా స్థానం కొనసాగుతున్నది. దశాబ్దాలపాటు కొనసాగించిన ఒకే సంతానం విధానాన్ని ప్రభుత్వం కొన్నేండ్లకిందటే పక్కన పెట్టినప్పటికీ అత్యధిక మంది చైనీయులు ఇప్పటికీ రెండో సంతానానికి మొగ్గుచూపటం లేదు. దీనివల్ల జననాల రేటు తగ్గిపోయి జనాభాలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నది. జనాభాలో 60 ఏండ్లకుపైబడిన వారి సంఖ్య 26.4 కోట్లకు పెరిగింది.