అమెరికా, ఆసియా సంస్థలపై ఆంక్షలు
అమెరికా హౌస్ స్పీకర్ మెక్‌కార్తీతో తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్వెన్ సమావేశమైనందుకు ప్రతీకారంగా రొనాల్డ్ రీగల్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ, ఆసియాకు చెందిన వివిధ సంస్థలపైనా చైనా ఆంక్షలు విధించింది. తైవాన్‌తో ఎలాంటి భేటీలు వద్దని అమెరికాను చైనా పదేపదే హెచ్చరించినా కాలిఫోర్నియా లోని రొనాల్డ్ రీగన్ లైబ్రరీలో ఈ భేటీ జరిగింది. అమెరికా`తైవాన్‌ల మధ్య ఇదే రెండో అత్యున్నత సమావేశం కావడం గమనార్హం. తైవాన్‌తో విదేశీ ప్రభుత్వాలు ఎలాంటి అధికారిక ఒప్పందాలు చేసుకున్నా అది ఆ ద్వీపంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమేనని చైనా చెబుతోంది. అందుకే త్సాయ్కి మార్చి 30న గ్లోబల్ లీడర్‌షీప్ అవార్డును బహుకరించిన హడ్సన్ ఇన్స్టిట్యూట్పైనా ఆంక్షలు విధించింది.













