కొత్త చట్టానికి చైనా గ్రీన్ సిగ్నల్… దీంతో ముగ్గురు
ముగ్గరు పిల్లల విధానానికి చైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ 13వ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ముగిశాయి. ఆ పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం దక్కింది. జనాభా, కటుంబ నియంత్రణ చట్టాన్ని కూడా సవరించారు. దీంతో ముగ్గురు పిల్లల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ చట్టాలను అమలు చేయాలని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సంతకం చేశారు. చైనాలో 60 ఏళ్ల వయసు దాటిన వారి సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఆ దేశం ముగ్గురు పిల్లల విధానాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ముగ్గురు పిల్లల్ని కనే దంపతులకు చైనా ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వనున్నది. ఫండింగ్, ట్యాక్సేషన్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేసణ్, హౌజింగ్, ఎంప్లామెంట్లో వారికి చేయూతనివ్వనున్నారు.
త్రీ చైల్డ్ పాలసీతో పాటు వ్యక్తిగత డేటా ప్రైవసీ రక్షణ చట్టానికి కూడా ఎన్సీపీ ఆమోదం తెలిపింది. వ్యక్తిగత సమాచార భద్రత చట్టం నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్నది. బయోమెట్రిక్స్, మెడికల్, హెల్త్, ఫైనాన్సియల్ లాంటి సున్నిత అంశాలు సేకరిస్తున్న సమయంలో వ్యక్తిగత ఆమోదం తప్పనిసరి అవుతుంది. డాక్టర్ల రక్షణ కోసం కూడా కొత్త చట్టాన్ని ఆమోదించారు. హెల్తీ చైనా వ్యూహాం అమలు కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. 2022, మార్చి ఒకటో తేదీ నుంచి ఆ చట్టం అమలవుతుంది. అవినీతి అంతానికి కూడా మరో చట్టాన్ని తెచ్చారు. నాలుగు దశల్లో యాంటీ కరప్షన్ బ్యూరో పని చేస్తుంది. ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి వస్తుంది.













